Layoffs: ఉద్యోగులను తొలగించే పనిలో మరో ఇండియాన్‌ టెక్‌ కంపెనీ.. జీతాల్లోనూ 50 శాతం కోత.

|

Dec 08, 2022 | 10:14 AM

వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వెనకాముందు చూడకుండా వేలాది మందిని ఇంటికి పంపిస్తున్నాయి. యాపిల్, గూగుల్‌, మెటా, ట్విట్టర్‌, అమెజాన్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితా చాలా..

Layoffs: ఉద్యోగులను తొలగించే పనిలో మరో ఇండియాన్‌ టెక్‌ కంపెనీ.. జీతాల్లోనూ 50 శాతం కోత.
Layoffs (Representative Image)
Follow us on

వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వెనకాముందు చూడకుండా వేలాది మందిని ఇంటికి పంపిస్తున్నాయి. యాపిల్, గూగుల్‌, మెటా, ట్విట్టర్‌, అమెజాన్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితా చాలా పెద్దదిగానే ఉంది. ఒక్క అమెజాన్‌ కంపెనీ ఏకంగా 20 వేల మందిని ఇంటికి సాగనంపనుందన్న వార్తలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఇక ఈ ఉద్యోగాల తొలగింపు అంతర్జాతీయ కంపెనీలకే పరిమితం కాలేదు. దేశీయంగా ఉన్న పలు టెక్‌ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి మరో ఇండియన్‌ కంపెనీ వేదాంతు వచ్చ చేరింది. ఈ ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ సంస్థ దాదాపు 385 మంది ఉద్యోగులను తొలగించనుంది. అంతేకాకుండా ముఖ్య స్థానంలో ఉన్న పలువురు ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించనున్నట్టు చెబుతున్నారు. కంటెంట్, టీచింగ్, హెచ్ఆర్ టీమ్‌లతో పాటు వివిధ విభాగాల్లోని వారిని తొలగించేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే వేదాంతు ఈ ఏడాది మొదటి నుంచే ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. ఏడాది ప్రారంభంలో దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించిన కంపెనీ తాజాగా మేలో మరో 200 మందిని ఇంటికి పంపించింది.

ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉందని వేదాంతు గడిచి మే నెలలో తెలిపింది. కరోన సమయంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు డిమాండ్‌ పెరగడంతో కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడంతో ఆన్‌లైన్‌ క్లాసులకు డిమాండ్‌ తగ్గింది. ఈ నేపథ్యంలోనే టెక్‌ఎడ్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని మార్కెట్ల వర్గాలు చెబుతున్నాయి. ఇక వేదాంతు పోటు ఓలా, మీషో, కార్స్24, ఉడాన్ వంటి పలు స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..