ECL Recruitment 2022: ఈసీఎల్‌ క్లర్క్‌ గ్రేడ్‌ 3 ఉద్యోగాలకు మీరు అర్హులా? బంపరాఫర్‌ మిస్‌కాకండీ..

|

Feb 07, 2022 | 8:02 PM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ ( (Eastern Coalfield Limited))లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి క్లర్క్‌ గ్రేడ్‌ 3 పోస్టుల (Clerk Grade III jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

ECL Recruitment 2022: ఈసీఎల్‌ క్లర్క్‌ గ్రేడ్‌ 3 ఉద్యోగాలకు మీరు అర్హులా? బంపరాఫర్‌ మిస్‌కాకండీ..
Ecl Recruitment
Follow us on

ECL Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ ( (Eastern Coalfield Limited))లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి క్లర్క్‌ గ్రేడ్‌ 3 పోస్టుల (Clerk Grade III jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు ఫుల్‌ టైం ప్రాతిపదికన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 195

అర్హతలు: అభ్యర్థులకు గుర్తింపు పొందిన సంస్థ/బోర్డ్ నుంచి పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా అభ్యర్ధులు కనీసం 3 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ పరీక్ష, ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్‌లో తెల్పిన విధంగా రాత పరీక్ష, అర్హత పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వ్రాత పరీక్ష 60 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2022.

ఈ కింది విధంగా దరఖాస్తు చేసుకోండి..

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ http://www.easterncoal.gov.in/ను ఓపెన్‌ చెయ్యాలి.
    హోమ్‌ పేజ్‌లో రిక్రూట్‌మెంట్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • ఇంటర్నల్ నోటిఫికేషన్ ఫర్‌ సెలక్షన్‌ ఆఫ్‌ క్లర్క్‌ గ్రేడ్‌ 3 కనిపిస్తుంది.
  • పూర్తి వివరాలను పూర్తిగా చదువుకుని అప్లికేషన్‌ను ప్రింట్‌ తీసుకోవాలి.
  • అప్లికేషన్‌లో అన్ని వివరాలను పూరించి, అవసరమైన డాక్యుమెంట్లను చేర్చాలి.
  • గడువు తేదీలోపు సంబంధిత సంస్థకు పోస్ట్‌ చేయాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NMDC Workmen Recruitment 2022: ఐటీఐ డిప్లొమా అభ్యర్ధులకు అలర్ట్‌! రూ.35 వేల జీతంతో 200 ఉద్యోగావకాశాలు..పూర్తి వివరాలివే!