
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహిస్తున్న ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,346 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 9, 2025వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ, బీఈడీ, బీఈఐ, ఈడీ, ఈడీ (డ్రాయింగ్/పెయింటింగ్/ఫైన్ ఆర్ట్) కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత సాధించి ఉండాలి. ఇంగ్లిష్, సామాజిక శాస్త్రం, పంజాబీ, సంస్కృతం, ఉర్దూ, గణితం సబ్జెక్టుల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ ఆధారంగా నవంబర్ 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ బోర్డు నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.