DRDO Scholarship 2022: ఏడాదికి రూ.1,86,600ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుకునే అవకాశం.. డోంట్ మిస్‌ ఇట్‌!

|

Mar 07, 2022 | 1:00 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

DRDO Scholarship 2022: ఏడాదికి రూ.1,86,600ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుకునే అవకాశం.. డోంట్ మిస్‌ ఇట్‌!
Drdo Scholarship
Follow us on

DRDO scholarship 2022 last date: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్‌ సంబంధిత స్పెషలైజేషన్లో యూజీ, పీజీ చదివే గర్ల్‌ స్టూడెంట్స్‌ (Female Students)కు మాత్రమే అందించబడుతుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 30

సబ్జెక్టులు: ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఎయిరో నాటికల్‌ ఇంజనీరింగ్‌, స్పేస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రాకెట్రీ, ఏవియోనిక్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్‌.

  • యూజీ స్కాలర్‌షిప్‌లు-20

స్కాలర్‌షిప్‌: ఏడాదికి రూ. 1,20,000ల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్‌ జేఈఈ మెయిన్‌ స్కోర్ కూడా ఉండాలి.

  • పీజీ స్కాలర్‌షిప్‌లు-10

స్కాలర్‌షిప్‌ మొత్తం: ఏడాదికి రూ.1,86,600ల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్‌) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ మెయిన్‌/గేట్‌ స్కోర్‌ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NOS Scholarship 2022-23: ఈ కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్నారా? చివరితేదీ ఇదే..