DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా మూడు రోజులు అవకాశం

DRDO Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది..

DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా మూడు రోజులు అవకాశం

Updated on: Jun 11, 2021 | 1:52 PM

DRDO Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL) కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF) పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 జూన్ 14 చివరి తేదీ. ఇంకా మూడు రోజులు మాత్రమే అవకాశం ఉంది. దరఖాస్తులను చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

పోస్టులు, అర్హతలు

జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీలు 10 ఉండగా అందులో మెకానికల్ ఇంజనీరింగ్- 7, ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్- 3 పోస్టులున్నాయి. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

విద్యార్హతల విరాలు చూస్తే జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టుకు మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్ స్కోర్ తప్పనిసరి. జేఆర్ఎఫ్ ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పోస్టుకు ఆ బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్ స్కోర్ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి. వేతనం రూ.31,000 + హెచ్ఆర్ఏ లభిస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Facebook : ఫేస్ బుక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసే వీలు

Civil Services Interview: ఆగస్టు 2 నుంచి సివిల్స్‌ ఇంటర్వ్యూలు.. త్వరలో ఈ-కాల్ లెటర్స్.. వెల్లడించిన యూపీఎస్సీ..