DRDO Recruitment 2022: గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRE) , బెంగళూరు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులందరూ DRDO GTRE రిక్రూట్‌మెంట్ 2022 కోసం అధికారిక వెబ్‌సైట్ లో 14 ఫిబ్రవరి 2022లో లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, మొత్తం 7 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ 2, ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజినీరింగ్ 2, మెకానికల్ ఇంజినీరింగ్ 1, ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ / టెక్నాలజీ / డేటాలజీ సైన్స్ 1 పోస్ట్‌ను కలిగి ఉంది. ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం, అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి BE / B.Tech డిగ్రీని కలిగి ఉండాలి. చెల్లుబాటు అయ్యే యునివర్సిటీ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. ఇది కాకుండా, ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి వయస్సు 28 ఏళ్లు మించకూడదు.
అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు , OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. విద్యార్హత, వయోపరిమితికి సంబంధించిన వివరణాత్మక సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.
ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా 21 ఫిబ్రవరి 2022న drdo.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ DRDO JRF రిక్రూట్‌మెంట్ 2022 కోసం అధికారిక వెబ్‌సైట్ లో 14 ఫిబ్రవరి 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: King Of Hearts Mustache: పేక ముక్కల్లో ఉండే కింగ్స్‌లో ఒక రాజుకు మీసాలుండవు.. ఎందుకో తెలుసా?