
డిజిటల్ ఇండియా కార్పొరేషన్.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఒప్పంద ప్రాతిపదికన హెడ్ ఎస్‌ఈఎంటీ, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబరు 5, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాంలో కనీసం 55 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉద్యోగానుభవం కూడా ఉండాలి. ఆ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 5, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది లక్షల రూపాయల్లో జీతం చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోండి.
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.