DAE Recruitment 2022: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీలో కొలువులకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హతలు తప్పనిసరి..

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ.. 70 జూనియర్ పర్చేజ్‌ అసిస్టెంట్/జూనియర్‌ స్టోర్‌ కీపర్‌ (గ్రూప్‌-సీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

DAE Recruitment 2022: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీలో కొలువులకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హతలు తప్పనిసరి..
Department of Atomic Energy Recruitment 2022

Updated on: Oct 31, 2022 | 3:44 PM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ.. 70 జూనియర్ పర్చేజ్‌ అసిస్టెంట్/జూనియర్‌ స్టోర్‌ కీపర్‌ (గ్రూప్‌-సీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో సైన్స్‌/కామర్స్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, మెకానికల్/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత చెక్‌ చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా/ఈఎస్‌ఎమ్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష (టైర్-1, టైర్- 2), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

రెండు విభాగాల్లో కలిపి 300ల మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. టైర్‌-1లో 200 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో, 200 మార్కులకు రెండు గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. టైర్‌-2లో 100 మార్కులకు 3 గంటల సమయంలో డిస్క్రిప్టివ్‌ టైప్‌లో పరీక్ష ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.