TSPSC Group 1: రాష్ట్రంలో గ్రూప్ 1 దరఖాస్తుల స్వీకరణ నేటితో (శనివారం) ముగియనుంది. ఈరోజు రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 503 ఉద్యోగాల కోసం టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో గ్రూప్ 1 పోస్టులను విడుదల చేయడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం నాటికి ఏకంగా 3,63,974 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పోస్టులకు అప్లై చేసుకున్నారు.
నిజానికి మే 31కే గడువు ముగియాల్సి ఉంది. కానీ దరఖాస్తు గడువు ముగుస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ముందుకొచ్చారు. దీంతో ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అభ్యర్థుల కోరిక మేరకు టీఎస్‌పీఎస్‌సీ దరఖాస్తుల స్వీకరణకు గడువును జూన్4 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మే 31 నాటికి 3,48,095 మంది దరఖాస్తు చేసుకోగా జూన్ 3 నాటికి కొత్తగా 15,879 మంది అప్లై చేసుకున్నారు. మరి చివరి తేది అయిన శనివారం ఎంత మంది దరఖాస్తు చేసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1కు ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..