Professor jobs: తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సటీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..

భారత ప్రభుత్వానికి చెందిన తిరువరూర్‌ (తమిళనాడు)లోని సెంట్రల్‌ యూనివర్సటీ ఆఫ్‌ తమిళనాడు (CUTN) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీ పోస్టుల (Faculty posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Professor jobs: తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సటీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..
Cutn

Updated on: Feb 23, 2022 | 9:03 AM

CUTN Teaching Faculty Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన తిరువరూర్‌ (తమిళనాడు)లోని సెంట్రల్‌ యూనివర్సటీ ఆఫ్‌ తమిళనాడు (CUTN) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీ పోస్టుల (Faculty posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 25

పోస్టుల వివరాలు:

  • ప్రొఫెసర్‌: 4
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 10
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 11

విభాగాలు: కామర్స్, హిస్టరీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, ఇంగ్లీష్‌, లా, మేనేజ్‌మెంట్‌, జియోగ్రఫీ, అప్లైడ్‌ సైకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 65 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ, మాస్టర్స్‌ డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఓబీజీ అభ్యర్ధులకు: రూ.750
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ. 500

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

SAI Jobs: నేరుగా ఇంటర్వ్యూతోనే..60 వేల జీతంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..