CUET 2022 Registration last date: కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET 2022) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బుధవారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్cuet.samarth.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లీషుతో సహా మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది. సీయూఈటీ పరీక్ష మూడు విభాగాలుగా ఉంటుంది. సెక్షన్ 1ఏ లో 13 భాషలు, సెక్షన్ 1బీ లో 19 భాషలుంటాయి. సెక్షన్ IIలో 27 domain-specific subjects ఉంటాయి. ఇకసెక్షన్ IIIలో జనరల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
కాగా 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగావున్న వివిధ సెంట్రల్ యూనివర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి గానూ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ను ఎన్టీఏ నిర్వహిస్తోంది. అంతేకాకుండా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ యూనివర్సిటీ అడ్మిషన్ విధానాన్ని ఢిల్లీ యూనివర్సిటీ మంగళవారం (ఏప్రిల్ 5) విడుదల చేసింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2022లో సాధించిన మార్కుల ఆధారంగానే అర్హతను నిర్ణయిస్తామని వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ (Yogesh Singh) ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్ధులు 12వ తరగతిలో చదివిన సబ్జెక్టుల నుంచి మాత్రమే సీయూఈటీ టెస్ట్ రాయవల్సి ఉంటుందని, ఆయా సబ్జెక్టుల కాంబినేషన్ ఆధారంగానే మెరిట్ లిస్టు తయారీ చేయబడుతుందని వీసీ యోగేష్ సింగ్ స్పష్టం చేశారు.
CUET 2022కు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి..
Today I had a meeting with Vice-Chancellors of 25 State Universities from Karnataka to discuss about Common University Entrance Test (CUET). The VCs have supported the introduction of CUET and have agreed to use CUET for admissions in BA, BSc, BCom and similar programmes. pic.twitter.com/sicXLd1ona
— Mamidala Jagadesh Kumar (@mamidala90) April 4, 2022
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: