CSIR UGC NET June Final Answer Key 2021: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ (CSIR UGC NET 2021) ఫైనల్ ఆన్సర్ కీ 2021ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో గురువారం (మార్చి 24) విడుదల చేసింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఆన్సర్ కీలను అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.inలో విద్యార్ధులు చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్ష జనవరి 29, ఫిబ్రవరి 15, 16,17 తేదీల్లో దేశవ్యాప్తంగా 339 కేంద్రాల్లో నిర్వహించబడింది. కాగా ఈ పరీక్షకు దాదాపు 1.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన విద్యార్ధులు ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా క్రాస్-చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై లేవనెత్తిన అభ్యంతరాలను మూల్యాంకనం చేసిన తర్వాతనే ఫైనల్ ఆన్సర్ కీ 2021ని ఎన్టీఏ విడుదల చేసింది. ఇక ఫలితాలు విడుదలయ్యాక .. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF-NET) అవార్డుకు అర్హత సాధించినవారి జాబితా, లెక్చర్‌షిప్ (LS-NET)/అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత సాధించినవారి జాబితా వేరువేరుగా ప్రకటిస్తారు. త్వరలో తుది ఫలితాలు కూడా విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఎన్టీఏ తెలియజేసింది.
CSIR UGC NET June Answer Key 2021ని ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
Also Read: