CSIR-NAL Bangalore Recruitment 2022: బెంగళూరులోని సీఎస్ఐఆర్ – నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్ (CSIR-NAL) స్టైపెండరీ ట్రైనీ (Stipendiary Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 40
పోస్టుల వివరాలు:
డిప్లొమా స్టైపెండరీ ట్రైనీలు: 10
గ్రాడ్యుయేట్ స్టైపెండరీ ట్రైనీలు: 30
1. డిప్లొమా స్టైపెండరీ ట్రైనీలు
అర్హతలు: ఇంజనీరింగ్ డిప్లొమా, సంబందిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీబీఏలో 2018 తర్వాత ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు అర్హులు. మైన్ ఫోర్ మెన్ సర్టిఫికేట్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.6000
2. గ్రాడ్యుయేట్ స్టైపెండరీ ట్రైనీలు
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబందిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9000
ట్రైనింగ్ పిరియడ్: 1 సంవత్సరం
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: ది సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినస్ట్రేషన్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్, పోస్ట్ బాక్స్ నెంబర్.1779, హెచ్ఏఎల్ ఎయిర్ పోర్ట్ రోడ్, కోడిహల్లి, బెంగళూరు- 560017.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: