CLAT Exam: ‘కేవలం ‘క్లాట్‌’ పరీక్ష ద్వారా లా అడ్మిషన్లు నిర్వహిస్తే.. సరైన ఫలితాలు రాబట్టలేం’

|

Dec 05, 2022 | 3:03 PM

నేషనల్ లా యూనివర్సిటీల్లో విద్యార్థులకు అడ్మిషన్లను ప్రతియేట క్లాట్‌ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం అనుసరిస్తున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌) పరీక్ష ద్వారా విద్యార్ధుల ఎంపిక సరైన సత్ఫలితాలను..

CLAT Exam: కేవలం ‘క్లాట్‌’ పరీక్ష ద్వారా లా అడ్మిషన్లు నిర్వహిస్తే.. సరైన ఫలితాలు రాబట్టలేం
Cji D Y Chandrachud
Follow us on

నేషనల్ లా యూనివర్సిటీల్లో విద్యార్థులకు అడ్మిషన్లను ప్రతియేట క్లాట్‌ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం అనుసరిస్తున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌) పరీక్ష ద్వారా విద్యార్ధుల ఎంపిక సరైన సత్ఫలితాలను ఇవ్వడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐయూఎల్‌ఈఆర్‌)లో తొలి అకడమిక్‌ సెషన్‌ శనివారం (డిసెంబ‌రు 3) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రచూడ్‌ మాట్లాడుతూ..

‘ఐఐయూఎల్‌ఈఆర్‌ వర్సిటీ అత్యాధునిక పరిశోధనలకు బీజం వేసి విద్యార్థుల పరిపూర్ణ వికాసానికి బాటలు వేస్తుందన్నారు. క్లాట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా లా యూనివర్సిటీల్లో విద్యార్ధుల సెలక్షన్‌ విధానం సరిగ్గాలేదని ఆయన అన్నారు. ఈ ఎంపిక విధానం ప్రస్తుతం జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న ఒక సమస్యగా భావిస్తున్నానన్నానని జస్టిస్ డివై చంద్రచూడ్‌ అన్నారు.

క్లాట్‌ పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకోవడం వల్ల విలువలతో కూడిన విద్యను అందించడం లేదన్నారు. న్యాయ రంగంపై సరైన దృక్పథమున్నవారికి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్యను లా స్టూడెంట్స్‌కు అందించాలని, వివిధ లీగల్‌ సబ్జెక్టులపై లోతైన పరిశోధన చేసేలా చూడాలని యూనివర్సిటీ వీసీకి ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.