TRAI Recruitment: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Dec 21, 2021 | 3:54 PM

TRAI Recruitment: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ..

TRAI Recruitment: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Trai Jobs
Follow us on

TRAI Recruitment: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో కన్సల్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి. లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 కన్సల్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఫైనాన్షియల్‌ అండ్‌ ఎకనమిక్‌ అనాలసిస్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, టెక్నాలజీ డెవపల్‌మెంట్‌ యూనిట్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ కేబుల్‌ సర్వీసెస్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ అండ్‌ పాలిసీ అనాలసిసీన్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* కన్సల్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు విభాగాల ఆధారంగా 32 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇందుకోసం ముందుగా ట్రాయ్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి నియామకానికి సంబంధించిన పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని.. అందులో సూచించిన విధంగా ఫామ్‌ నింపాలి.

* అనంతరం ఫామ్‌ను సీనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌, ట్రాయ్‌, మహానగర్‌ దూర్‌ సంచార్‌ భవన్‌, న్యూఢిల్లీ 110002 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 27-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: ఇద్దరి ఫ్రెండ్‌షిప్ మామూలుగా లేదుగా..! కోతి దొంగతనానికి సాయం చేసిన కుక్క.. షాకింగ్ వీడియో

Railway Recruitment 2021: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..!

Miss Universe 2021: మిస్ యూనివర్స్ ధరించిన కిరీటం విలువ 37 కోట్లు.. గెలుచుకున్న సదుపాయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..