Cochin Shipyard Recruitment 2022: ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నారా? ఐతే ఈ ఉద్యోగాలు మీకోసమే.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే..

|

Feb 07, 2022 | 4:37 PM

Cochin Shipyard latest jobs: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెట్‌ (Cochin Shipyard ) ఒప్పంద ప్రాతిపదికన (contract basis jobs) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: ఖాళీల సంఖ్య: 46 పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు, క్వాలిటీ ఇన్‌స్పెక్షన్‌, ఫాబ్రికేషన్‌ అసిస్టెంట్లు, […]

Cochin Shipyard Recruitment 2022: ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నారా? ఐతే ఈ ఉద్యోగాలు మీకోసమే.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే..
Cochin Shipyard Ltd
Follow us on

Cochin Shipyard latest jobs: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెట్‌ (Cochin Shipyard ) ఒప్పంద ప్రాతిపదికన (contract basis jobs) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 46

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు, క్వాలిటీ ఇన్‌స్పెక్షన్‌, ఫాబ్రికేషన్‌ అసిస్టెంట్లు, ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్లు, మూరింగ్‌ అండ్ స్కాఫోల్డిండ్ అసిస్టెంట్లు.

విభాగాలుః మెకానికల్‌, హాల్‌, మెహినరీ, వాల్వ్‌ అండ్‌ పైపింగ్‌, పెయింటింగ్‌, ఎలక్ట్రికల్‌, వెల్డర్‌, పైప్‌ ప్లంబర్‌

పే స్కేల్: నెలకు రూ.25,000ల జీతంగా చెల్లిస్తారు(ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి).

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, 3 సంవత్సరాల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 17, 2022 నాటికి 30 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్ధులకు రాత పరీక్ష, ప్రాక్టికల్‌, ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. వీటి ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక ఉంటుంది. పరీక్ష విధానం, మార్కుల కేటాయింపు వంటి ఇతర సమాచారం కోసం నోటిఫికేషన్‌ చూడొచ్చు.

అడ్రస్‌: Cochin Shipyard Limited – Mumbai Ship Repair Unit (CMSRU) cabin, MbPT Green Gate, Shoorji Vallabhdas Road, Fort, Mumbai – 400001.

ఇంటర్వ్యూ తేదీలు: 2022, ఫిబ్రవరి15, 16, 17 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Fact Check: ఆఫ్‌లైన్‌ ఎగ్జామ్స్ అంటూ నెట్టింట ప్రచారం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన UGC