దేశవ్యాప్తంగా మూతబడుతున్న FIIT JEE సెంటర్లు.. విద్యార్థుల పరిస్థితేంటి…?

దేశవ్యాప్తంగా ఫిట్జీ కోచింగ్‌ సెంటర్లు మూతబడుతున్నాయి. డైరెక్టర్లపైనా కేసులు నమోదవుతున్నాయి. అసలేంటి...? ఏం జరుగుతోంది...? ఫిట్జీకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది...? విద్యార్థుల పరిస్థితేంటి…? ఆర్థిక, పాలనాపరమైన సవాళ్లు, గత కొన్ని నెలలుగా టీచర్లకు జీతాలు చెల్లించలేకపోవడమే ఇందుకు కారణమని ప్రాథమికంగా తెలిసింది.

దేశవ్యాప్తంగా మూతబడుతున్న FIIT JEE సెంటర్లు.. విద్యార్థుల పరిస్థితేంటి…?
FIITJEE

Updated on: Jan 25, 2025 | 1:29 PM

దేశంలో పోటీపరీక్షల కోచింగ్‌కు పేరొందిన ఫిట్జీ సెంటర్లు మూతబడుతున్నాయి. యూపీ, ఢిల్లీ సహా నార్త్‌లో ఉన్న చాలా సెంట్లర్లు ఒక్కొక్కటిగా షట్‌డౌన్ అవుతున్నాయి. ఇటు నార్త్‌లోనూ అదే వాతావరణమే కనిపిస్తోంది. ఫిట్జీలో చాలా నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదన్న టాక్‌ నడుస్తోంది. పలువురు స్టాఫ్‌ కూడా ఇదే విషయాన్ని బహిర్గతం చేశారు. ఆర్ధిక సంక్షోభం ఉన్నందునే కోచింగ్‌ సెంటర్లను క్లోజ్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. నోయిడా నుంచి నిరుద్యోగులను రప్పించి ఇన్‌స్టిట్యూట్స్‌ నడిపించినా అదీ మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. అంతేకాదు ఫిట్జీ బ్రాంచీల‌పై ఇటీవ‌ల ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంది. లైసెన్సులు లేవ‌ని, ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించ‌డం లేద‌ంటూ కోచింగ్‌ సెంటర్లపై పెద్ద ఎత్తున నిఘా పెట్టింది.

ఇక ఆకస్మాత్తుగా ఫిట్జీ కోచింగ్ సెంటర్లను మూసివేయడం వివాదస్పదమైంది. వారం రోజుల నుంచి ఆ సెంట‌ర్లు తెరవపోవడంతో విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. బోర్డు ప‌రీక్షలు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఇలా ఇనిస్టిట్యూషన్స్‌ మూసివేడయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్‌ నుంచి ముందస్తు నోటీసు కానీ, రిఫండ్ కానీ ఇవ్వలేద‌ంటూ ఫైర్‌ అలయ్యారు.

ఐఐటీ ఢిల్లీ నుంచి మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన డీకే గోయ‌ల్ ఫిట్జ్ సంస్థను 1992లో స్థాపించారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ప‌రీక్షలకు కోచింగ్ ఇవ్వడంలో మంచి గుర్తింపు పొందిన ఫిట్జీ సంస్థ దేశ‌వ్యాప్తంగా 41 న‌గ‌రాల్లో 72 కోచింగ్ కేంద్రాలకు విస్తరించింది. సంస్థలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంతో పలు నగరాల్లోని కోచింగ్ సెంటర్లు మూతపడటంతో ఉద్యోగులే కాకుండా విద్యార్థులు, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు.