CLAT 2026 Application: క్లాట్‌ 2026 ప్రవేశ పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయలేదా? ఇదే చివరి ఛాన్స్‌..

CLAT 2026 Registration last date: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మొదలైనాయి..

CLAT 2026 Application: క్లాట్‌ 2026 ప్రవేశ పరీక్షకు ఇంకా దరఖాస్తు చేయలేదా? ఇదే చివరి ఛాన్స్‌..
CLAT 2026 registration deadline

Updated on: Nov 02, 2025 | 10:43 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 2: దేశవ్యాప్తంగా 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మొదలైనాయి. నవంబర్‌ 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌ 2026) డిసెంబర్‌ 7న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

క్లాట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం (యూజీ, పీజీ, డిగ్రీ) ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అండర్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ), పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ) దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు యూజీ కోర్సుకైతే కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌లో అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు చివరి తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)-2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌) 2026 దరఖాస్తు గడువు పెంపు

డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌) 2026’ నోటిఫికేషన్‌ను ఇటీవల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీబీ) బాంబే విడుదల చేసింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా హైదరాబాద్‌, బాంబే, దిల్లీ, గువాహటి, రూర్కీ, ఇందౌర్‌ల్లోని.. ఐఐటీల్లో, ఐఐఐటీడీఎం (జబల్పూర్‌) సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో బీడిజైన్‌ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. యూసీడ్‌ స్కోర్‌ వ్యాలిడిటీ ఏడాది వరకు ఉంటుంది. అభ్యర్థులు వరసగా రెండుసార్లు మాత్రమే ఈ టెస్ట్‌ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్‌ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా నవంబర్‌ 5, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుంతో నవంబర్‌ 10, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇక యూసీడ్‌ 2026 జనవరి 18వ తేదీన నిర్వహించనున్నారు. ఫలితాలు మార్చి 6న వెల్లడిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.