UPSC Civils-2021: సివిల్స్ లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ర్యాంకర్ల సలహాలు తెలుసుకోండి..

సివిల్ సర్వీసెస్ లో చేరడం ఇండియాలో గొప్ప గౌరవంగా భావిస్తారు. సివిల్స్ సాధించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ దిశగా చాలా తక్కువ మందే అడుగులేస్తారు.

UPSC Civils-2021: సివిల్స్ లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ర్యాంకర్ల సలహాలు తెలుసుకోండి..
Civils 2021

Edited By: Janardhan Veluru

Updated on: Sep 25, 2021 | 6:14 PM

సివిల్ సర్వీసెస్ లో చేరడం ఇండియాలో గొప్ప గౌరవంగా భావిస్తారు. సివిల్స్ సాధించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ దిశగా చాలా తక్కువ మందే అడుగులేస్తారు. సివిల్స్ సాధించడం అంటే చిన్న విషయం కాదు దానికి ఎంతో క్రమశిక్షణ, ప్లానింగ్ అవసరం. చక్కటి వ్యుహాలతో చదివిన వారే విజయం సాధిస్తారు. తాజాగా యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల చేసింది.

బీహార్ లోని కటిహార్ కు చెందిన శుభమ్ కుమార్ సివిల్స్ లో టాప్ ర్యాంకు సాధించారు. ఆయన ముంబయి ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. మొదటిసారిగా 2018లో యూపీఎస్సీ పరీక్ష రాశారు. 2019లో పరీక్ష రాసి 290 ర్యాంకు సాధించి ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన పుణేలోని నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ పొందుతున్నారు. బీహార్ లోని విద్యావిహార్ రెసిడెన్షియల్ స్కూల్ లో 10వ తరగతి చదివారు. బొకారోలోని చిన్మయ విద్యాలయంలో 12వ తరగతిలో 96 శాతంతో ఉత్తీర్ణత చెందారు. ఇంటర్వ్యూ కోసం నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అయినట్లు తెలిపారు శుభం కుమారు. మాక్ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లు చెప్పారు. పేద ప్రజలకు సేవ చేయడం తన లక్ష్యమని పేర్కొన్నారు.

సివిల్స్ లో తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది వరకు ఎంపికైనట్లు తెలుస్తోంది. వరంగల్‌కు చెందిన శ్రీజ 20వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన అన్నదమ్ములు రాళ్లపల్లి జగత్‌సాయి 32వ ర్యాంకు, రాళ్లపల్లి వసంత్‌కుమార్‌ 170వ ర్యాంకు సాధించడం విశేషం.

రోజుకు ఐదారు గంటలు చదివా – పి.శ్రీజ(20వ ర్యాంకు)

మాది వరంగల్‌. నా చిన్నప్పుడే మా కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో స్థిరపడ్డాం. నాన్న శ్రీనివాస్‌ హబ్సిగూడలో హోండా షోరూంలో సూపర్‌వైజర్‌ . అమ్మ లత జనగామ జిల్లా రఘునాథపల్లి పీహెచ్‌సీలో ఒప్పంద ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ఉస్మానియా మెడికల్‌ కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశా. పరిపాలనా పరమైన విభాగంలో ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్న ఉద్దేశంతో సివిల్స్‌-2020 రాశా. మొదటి నుంచి ప్రిలిమ్స్‌ కోసం కాకుండా మెయిన్స్‌ లక్ష్యంగా ప్రిపేర్‌ అయ్యా. రోజుకు ఐదారు గంటలు చదివాను. ఆప్షనల్‌ సబ్జెక్టుగా మెడికల్‌ సైన్స్‌ ఎంచుకున్నా. ఆన్‌లైన్‌ వనరులను వినియోగించుకున్నా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. డాక్టర్‌ చదివినా.. నాన్న కోరిక మేరకు సివిల్స్‌ రాశా.

ప్రజలకు సేవచేయడమే లక్ష్యం- – మేఘ స్వరూప్‌(31వ ర్యాంకర్‌)

మాది కర్నూలు జిల్లా బండిఆత్మకూరు నారాయణపురం.నాన్న చంద్రశేఖరరావు పవర్‌గ్రిడ్‌లో జనరల్‌ మేనేజర్‌. పంజాజ్‌లో పనిచేస్తున్నారు. అమ్మ అరుణ. ప్రస్తుతం ఐపీఎస్‌గా హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నా. ఐఏఎస్‌ లక్ష్యంతో మళ్లీ పరీక్ష రాశా. వారణాసిలో ఐఐటీబీహెచ్‌యూ పూర్తి చేశాను. బెంగళూరులోని శ్యామ్‌సంగ్‌ రీసెర్చ్‌లో మూడేళ్లపాటు ఉద్యోగం చేశా. ఎలాగైనా సివిల్స్‌ సాధించాలన్న పట్టుదలతో ఉద్యోగం వదిలి పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ప్రజలకు సేవచేయాలన్న కోరికతోనే ఉద్యోగం వదిలి పట్టుదలతో సివిల్స్‌కు ప్రయత్నించా.

మరిన్ని ఇక్కడ చూడండి: రిపబ్లిక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. Republic Pre-Release Event LIVE | Pawan Kalyan | Sai Dharam Tej

Rajasthan politics: రాహుల్‎ గాంధీతో‎ సచిన్ పైలట్ సమావేశం.. నాయకత్వ మార్పుకేనా?