Isc Semester 2 Exams
ISC Semester 2 Exam 2022 Guidelines: ఐఎస్సీ (ISC) 12వ తరగతి సెమిస్టర్ 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. కాగా ఐసీఎస్సీ పరీక్షలు 2022 ఏప్రిల్ 26 నుంచి జూన్ 13 వరకు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో విద్యార్ధులకు కింది సూచనలు తప్పనిసరిగా పాటించవల్సిందిగా పేర్కొంది. అవేంటంటే..
CISCE ISC సెమిస్టర్ 2 పరీక్ష 2022 మార్గదర్శకాలు ఇవే..
- అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలి. లేదంటే రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుంది.
- పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్, హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలో కోవిడ్ 19 మార్గదర్శకాలను విధిగా పాటించవల్సి ఉంటుంది.
- ఆన్సర్ షీట్‌లో సంతకానికి కేటాయించిన స్థలంలో మాత్రమే సిగ్నేచర్ చెయ్యాలి. సిగ్నేచర్‌తోపాటు ఐడీ నెంబర్, ఇండెక్స్ నంబర్, సబ్జెక్ట్ పేరును మాత్రమే షీట్‌లో రాయాలి.
- ప్రతి ప్రశ్నకు సమాధానం రాసేముందు ప్రారంభంలో ఎడమ చేతి మార్జిన్‌లో ప్రశ్న సంఖ్య స్పష్టంగా రాయాలి. బ్లూ లేదా బ్లాంక్ ఫౌంటెన్ లేదా బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే సమాధానాలు రాయాలి. డయాగ్రామ్స్ గీసేటప్పుడు మాత్రమే పెన్సిల్‌ను ఉపయోగించాలి.
- మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, హెడ్‌ఫోన్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లకూడదు.
Also Read: