పరీక్షలంటే అందరికీ భయమే.. కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి..

|

Dec 12, 2021 | 8:11 AM

Exam Tips: చిన్నపిల్లలైనా, పెద్దవారైనా పరీక్ష పేరు చెబితే అందరూ భయపడతారు. అయితే పిల్లల పరీక్షలకు, పెద్దల పరీక్షలకు చాలా తేడా ఉంది.

పరీక్షలంటే అందరికీ భయమే.. కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి..
Board Exam
Follow us on

Exam Tips: చిన్నపిల్లలైనా, పెద్దవారైనా పరీక్ష పేరు చెబితే అందరూ భయపడతారు. అయితే పిల్లల పరీక్షలకు, పెద్దల పరీక్షలకు చాలా తేడా ఉంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షల్లో రాణించి మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కోరుకుంటారు. అయితే పిల్లల పరీక్ష వారిదే కాదు తల్లిదండ్రులది కూడా. పిల్లల పరీక్ష ప్రారంభమైనప్పుడు తల్లిదండ్రులకు కూడా కొంత బాధ్యత ఉంటుంది. తద్వారా పిల్లలు పరీక్షలో రాణించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం చిన్న పిల్లల పరీక్ష నుంచి10-12 పరీక్షల వరకు అందరు టెన్షన్‌గా ఫీలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల్లో టెన్షన్‌ తగ్గించి వారిని చైతన్యవంతం చేయాలి. పరీక్షల సమయంలో వారికి మంచి విషయాలు చెప్పాలి. బాగా చదివేలా ప్రోత్సహించాలి. మీ పిల్లలు పరీక్ష గురించి ఒత్తిడికి లోనవుతున్నట్లయితే దాని నుంచి బయటపడటానికి ఎదో ఒకటి చేయండి. అప్పుడే వారికి మీరున్నారన్న ధైర్యం ఏర్పడుతుంది.

పిల్లల సమస్యలను అర్థం చేసుకోవడం
పరీక్షల సమయంలో పిల్లలు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలకు అండగా నిలవాలి. వారి సమస్యలను వినండి పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించండి. నేటి తల్లిదండ్రులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. వారు ఎంత బిజీగా ఉన్నా తమ పిల్లలతో కొంత సమయం గడపవచ్చు. ముఖ్యంగా పరీక్ష సమయంలో పిల్లలతో ఉంటూ వారి సమస్యలను అర్థం చేసుకోవాలి. ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచాలి.

పిల్లలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. తద్వారా వారి మనస్సు చదువులో నిమగ్నమై ఉంటుంది. ఎప్పుడూ టాపర్‌గా ఉండాలని పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు భిన్నమైన తెలివి కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి సామర్థ్యాలు కూడా భిన్నంగా ఉంటాయి. మీ పిల్లలని ప్రోత్సహించండి విజయవంతమైన వ్యక్తుల పోరాటాల గురించి చెప్పండి. కానీ అతనిపై అది చేయండి ఇది చేయండని ఒత్తిడి మాత్రం చేయకండి.

ఈ 10 ఫైనాన్స్‌ కంపెనీలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి.. ఎంతంటే..?

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ కరగాలంటే ఈ ఆహారాలు తినండి..! ఎందుకంటే..?

పాత నాణేలు నిజంగానే లక్షలు పలుకుతాయా..! వాటికి ఎందుకంత డిమాండ్‌..? కారణం ఇదే..