Railway Jobs: నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే శుభవార్త తెలిపింది. పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారికి సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉద్యోగాలు పొందే సదవకాశాన్ని కల్పించింది. ముంబయి ప్రధాన కేంద్రంగా ఉండే సెంట్రల్ రైల్వే, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2422 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, టర్నర్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి ట్రేడుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 17-01-2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 16-02-2022 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Viral Video: ఇక్కడ బేరాలు లేవమ్మా.. కోతి కూరగాయల యాపారం మామూలుగా లేదుగా..
Bird Flu: సర్కార్ సంచలన నిర్ణయం.. 2.5 మిలియన్ల కోళ్లను చంపాలని డిసైడ్.. కారణమేంటంటే..