CISF ASI and Head Constable Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (CISF).. 540 అసిస్టెంట్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్ట్రీరియల్) పోస్టుల (ASI and Head Constable Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అక్టోబర్ 25, 2022వ తేదీనాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 25, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 26, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్‌ఎం/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఆధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.