C-DAC Recruitment: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. దర ఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (మంగళవారం) ముగియనున్న నేపథ్యంలో నోటిపికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు 15 ఖాళీలున్నాయి. బీఎస్‌సీ డెవలపర్, క్లౌడ్ డెవలపర్, ఈ గవర్నెన్స్ యాప్ డెవలపర్, బీఎస్‌సీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* ప్రాజెక్ట్ అసోసియేట్లు (క్లౌడ్ సపోర్ట్): 04 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 40,000, ప్రాజెక్ట్ అసోసియేట్లకు రూ. 34,000 జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ రేపటితో (18-01-2022)తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Garlic: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వెల్లుల్లి అస్సలు తినకూడదు.. తింటే మీ పని అంతే..?
Immunity Booster Drink: రోగనిరోధక శక్తిని పెంచే ఈ డ్రింక్ ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి..