CDAC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! సీడ్యాక్‌లో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్‌..పూర్తివివరాలివే!

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC).. ఒప్పంద ప్రాతిపదికన ముంబాయి సెంటర్‌లో పనిచేయడానికి ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer Posts)..

CDAC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! సీడ్యాక్‌లో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్‌..పూర్తివివరాలివే!
Cdac
Follow us
Srilakshmi C

|

Updated on: May 12, 2022 | 1:28 PM

CDAC Mumbai Project Manager Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC).. ఒప్పంద ప్రాతిపదికన ముంబాయి సెంటర్‌లో పనిచేయడానికి ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 101

పోస్టుల వివరాలు:

  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 42
  • ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు: 24
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 27
  • ప్రాజెక్ట్‌ లీడ్‌ పోస్టులు: 1
  • మాడ్యూల్‌ లీడ్‌ పోస్టులు: 4
  • నాలెడ్జ్ పార్ట్నర్‌ పోస్టులు: 1
  • ప్రోగ్రాం మేనేజర్ పోస్టులు: 2

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.500
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీలు: మే 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIM Vizag Recruitment 2022: నెలకు రూ.50,000లజీతంతో.. విశాఖపట్నం ఐఐఎంలో ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక