
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE).. వివిధ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ A, B, C విభాగాలలో మొత్తం 124 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 22, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
సంబంధిత పోస్టులను అనుసరించి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 27 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 22, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు గ్రూప్-ఏ పోస్టులకు రూ.1750. గ్రూప్-బీ, సీ పోస్టులకు రూ.1050 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ/పర్సనల్ ఇంటరాక్షన్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.