CBSE term 2 Exam 2022: సీబీఎస్సీ టర్మ్‌ 2 ప్రాక్టికల్స్‌పై కీలక ప్రకటన విడుదల! నేడే టర్మ్‌ 1 ఫలితాలు..

|

Mar 09, 2022 | 2:00 PM

సీబీఎస్సీ టర్మ్ 2 ప్రాక్టికల్ ఎగ్జామ్ 2022కు సంబంధించి బోర్డు కీలక నోటీసును జారీ చేసింది. బోర్డు అనుబంధ పాఠశాలు, పరీక్షలు నిర్వహించే ఉపాధ్యాయులకు కఠిన నిబంధనలు జారీ చేసింది..

CBSE term 2 Exam 2022: సీబీఎస్సీ టర్మ్‌ 2 ప్రాక్టికల్స్‌పై కీలక ప్రకటన విడుదల! నేడే టర్మ్‌ 1 ఫలితాలు..
Cbse Term 2
Follow us on

CBSE term 2 practical 2022 exam instructions: సీబీఎస్సీ టర్మ్ 2 ప్రాక్టికల్ ఎగ్జామ్ 2022కు సంబంధించి బోర్డు కీలక నోటీసును జారీ చేసింది. బోర్డు అనుబంధ పాఠశాలు, పరీక్షలు నిర్వహించే ఉపాధ్యాయులకు కఠిన నిబంధనలు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్ (CBSE practicals) పరీక్షల్లో విద్యార్థులకు కేవలం 1.30 గంటలు మాత్రమే పాఠశాలలు కేటాయిస్తున్నాయని, షెడ్యూల్‌ ప్రకారం వారికి3 గంటల సమయం తప్పనిసరిగా కేటాయించాలని స్పష్టం చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టులకు నిర్వహించే రెండు ప్రాక్టికల్స్‌కు కొన్ని పాఠశాలలు సగం సమయం మాత్రమే ఇస్తున్నట్లు బోర్డు దృష్టికి వచ్చిందని సీబీఎస్‌ఈ తెలిపింది. ప్రాక్టికల్స్ సమయంలో వారిక పూర్తి సమయం కేటాయించాలని పేర్కొంది. ప్రాక్టికల్ పరీక్ష కోసం కేటాయించిన తేదీ, సమయంలో అన్ని పాఠశాలలు తమ ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని సూచించినట్లు బోర్డు తెలిపింది. ఉపాధ్యాయులను రిలీవ్ చేయని పాఠశాలలపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుంది. టర్మ్ 2కు సంబంధించిన 10, 12 తరగతుల ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 7 నుంచి 17 వరకు జరుగుతాయి. టర్మ్‌ 2 కు సంబంధించి థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభమవుతాయి. ఇక సీబీఎస్సీ 12వ తరగతి టర్మ్‌1 పరీక్షల ఫలితాలు బుధవారం (మార్చి 9)న వెలువడనున్నాయి. వీటి తర్వాత 10వ తరగతి ఫలితాలు వెల్లడించనున్నట్లు బోర్డు తెల్పింది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ cbse.gov.in.ను సందర్శించవచ్చు.

Also Read:

NEET 2022 Exam Date: ఈ ఏడాది నీట్‌ పరీక్ష సకాలంలోనే.. వచ్చేవారం నోటిఫికేషన్‌..జూన్‌ చివరిలో..