CTET పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. ఎగ్జామ్స్‌ ఎప్పటి నుంచి అంటే..?

|

Dec 12, 2021 | 9:02 AM

CBSE C TET Admit Card 2021: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) CTET పరీక్ష అడ్మిట్ కార్డ్ 2021ని విడుదల చేసింది.

CTET పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. ఎగ్జామ్స్‌ ఎప్పటి నుంచి అంటే..?
Ctet 2021
Follow us on

CBSE C TET Admit Card 2021: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) CTET పరీక్ష అడ్మిట్ కార్డ్ 2021ని విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఎగ్జామ్‌ రెండు షిఫ్టుల్లో జరగనుంది. మొదటి షిప్టు ఉదయం 9:30 గంటలకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 15న ఫలితాలు వెలువడుతాయి.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా..?
1. అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inని సందర్శించండి.
2. అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. వివరాలను నమోదు చేసి లాగిన్ చేయండి.
4. అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
5. డౌన్‌లోడ్ చేయండి. ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

ధృవీకరణ, గుర్తింపు ప్రయోజనాల కోసం పరీక్ష హాల్‌కు ఈ-అడ్మిట్ కార్డ్ ప్రింటవుట్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి. అడ్మిట్ కార్డులో ఇచ్చిన సమాచారం అంతా సరైనదేనని అభ్యర్థులు చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పులు గమనించినట్లయితే సదరు శాఖను సంప్రదించడం ద్వారా సరిదిద్దవచ్చు. పరీక్షకు అడ్మిట్ కార్డ్ చాలా ముఖ్యమైనది కాబట్టి అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని తమ వద్దే ఉంచుకోవాలి. CTET 2021 ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

పరీక్షా సరళి
పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి- ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. పేపర్ Iలో చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాగోజీ, లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. పేపర్ IIలో చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాగోజీ, లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఈ 10 ఫైనాన్స్‌ కంపెనీలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి.. ఎంతంటే..?

పాత నాణేలు నిజంగానే లక్షలు పలుకుతాయా..! వాటికి ఎందుకంత డిమాండ్‌..? కారణం ఇదే..

పరీక్షలంటే అందరికీ భయమే.. కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి..