CBSE Board Key Decision: 2021వ సంవత్సరం బోర్డు పరీక్షలకు హాజరుకానున్న 10, 12వ తరగతి విద్యార్ధులకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గుడ్ న్యూస్ అందించింది. అదే ఇయర్‌లో 10, 12వ తరగతి విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు హాజరు కావచ్చునని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తెలిపింది.
వాస్తవానికి, గతంలో విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాయాలంటే ఒక సంవత్సరం ఆగాల్సి ఉండేది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అదే అకాడమిక్ ఇయర్‌లో ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసే వెసులుబాటును సీబీఎస్ఈ బోర్డు కల్పించింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తర్వాత నిర్వహించే కంపార్ట్‌మెంట్ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావచ్చునని.. ఈ రెండు ఎగ్జామ్స్‌లో వచ్చే మార్కులలో ఉత్తమమైన వాటిని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. అయితే, ఇది కేవలం ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితమవుతుందని స్పష్టం చేసింది. చేయబడుతుంది. జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)కు అనుగుణంగా ఈ వెసులుబాటును కల్పించామని” సీబీఎస్ఈ ఓ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) కింద, సీబీఎస్ఈ బోర్డు విద్యార్ధుల నైపుణ్యాలను పెంచేందుకు పలు అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!