CBI Recruitment: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా కన్సల్టెంట్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పదవి విరమణ పొందిన పోలీసులు అర్హులు.ఎంపికైన అభ్యర్థులు చంఢీగఢ్, పంచకులా, మొహాలీలోని పలు కోర్టులలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
సెంట్రల్/స్టేట్‌లో ఇన్‌స్పెక్టర్ ఆపై హోదాలో పనిచేసిన వారు అర్హులు. అభ్యర్థులకు పేర పరిశోధన రంగంలో కనీసం 10 ఏళ్లు అనుభవం ఉండాలి. ఇక విద్యార్హతల విషయానికొస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సీబీఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం అవసరమైన సమచారాన్ని అందించి ఆఫ్‌లైన్ మోడ్‌లో పంపించాలి.
దరఖాస్తు హార్డ్ కాపీని జాయింట్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ జోన్, సీబీఐ, చండీఘడ్ జోన్, సెక్టర్ 30 ఏ అడ్రస్‌కు మే 31, 2022లోపు చేరేలా పంపించాల్సి ఉంటుంది. గడువు ముగిసన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించరు. పూర్తి వివరాల కోసం సీబీఐ అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్‌చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..