UPSC Interview Pattern: గత కొన్నేళ్లుగా పర్సనాలిటీ టెస్ట్‌లో అడిగే ప్రశ్నల్లో మార్పులు వస్తున్నాయి: బ్రెయిన్ ట్రీ డైరెక్టర్

|

Dec 07, 2022 | 4:35 PM

కీలకమైన ఇంటర్వ్యూ ఘట్టంలో గట్టెక్కాలంటే ప్యానెల్‌ అడిగే ప్రశ్నల సరళిపై అవగాహన ఉండాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాల కృష్ణ ఏంమంటున్నారంటే..

UPSC Interview Pattern: గత కొన్నేళ్లుగా పర్సనాలిటీ టెస్ట్‌లో అడిగే ప్రశ్నల్లో మార్పులు వస్తున్నాయి: బ్రెయిన్ ట్రీ డైరెక్టర్
UPSC Interview Pattern
Follow us on

ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ మెయిన్స్‌ 2022 ఫలితాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 2529 మంది అభ్యర్ధులు ఇంటర్వ్యూకి ఎంపిక అయ్యారు. ఐతే చివరి దశ అయిన ఇంటర్వ్యూలో కూడా మెప్పిస్తేనే ఐఏఎస్, ఐపీఎస్ వంటి కేంద్ర సర్వీసులకు ఎంపికవుతారు. మెయిన్స్‌ 1750 మార్కులకు, ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులకుగానూ ఈ రెండింటిలో సంపాదించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్‌ తయారు చేస్తారు. కీలకమైన ఇంటర్వ్యూ ఘట్టంలో గట్టెక్కాలంటే ప్యానెల్‌ అడిగే ప్రశ్నల సరళిపై అవగాహన ఉండాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాల కృష్ణ ఏంమంటున్నారంటే..

సివిల్‌ సర్వీసులకు తగిన వారిని ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూ ప్యానెల్‌ 360 డిగ్రీల కోణంలో అంచనా వేయడానికి అనుగుణమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంటర్వ్యూ పర్సనాలిటీ, ఆప్టిట్యూడ్‌కు సంబంధించినవి మాత్రమేకాకుండా, కరెంట్ అఫైర్స్‌, సంబంధిత అంశాలపై ప్రశ్నలు సంధిస్తుంటారు. ముఖ్యంగా బోర్డు అడిగే ప్రశ్నలు.. సామాజిక సమస్యలు, ఆర్థిక కొలతలు, సుపరిపాలన ఇతివృత్తంతో ముడిపడి ఉంటాయి. అభ్యర్ధుల్లో లీడర్‌షిప్‌, నిర్ణయం తీసుకోవడం (decision making), ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించడానికి సిట్యుయేషన్ ఆధారిత ప్రశ్నలను డిజైన్‌ చేస్తారు. బట్టిపట్టిన వాళ్లు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేక్రమంలో తేలిపోతారు. అసలుసిసలైన వారిని వడపోతపట్టి ఎంపిక చేయడమే యూపీఎస్సీ ఇంటర్వ్యూ ప్యానెల్‌ అసలు లక్ష్యం. కూడా అడుగుతారని గోపాల కృష్ణ చెప్పారు.

ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 75 మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుంటూ పరీక్షలు రాసిన వాళ్లతోకూడా కలుపుకుంటే మొత్తం 100 మంది వరకు ఉండవచ్చని గోపాల కృష్ణ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.