Canara Bank Recruitment: కెనరా బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయిలోని కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్పెషల్, జనలర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* జనరల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ 2022-23/ 02లో భాగంగా డిప్యూటీ మేనేజర్(కంపెనీ సెక్రటరీ) (01), అసిస్టెంట్ మేనేజర్(బ్యాక్ ఆఫీస్ కంప్లయన్స్, ఇనిస్టిట్యూషనల్ డీలర్, సర్వైలెన్స్) (03), జూనియర్ ఆఫీసర్ (కేవైసీ, బ్యాక్ ఆఫీస్- సెటిల్మెంట్, రిటైల్ డీలర్) (04), అసిస్టెంట్ మేనేజర్- ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ (01), అసిస్టెంట్ మేనేజర్ బ్యాక్ ఆఫీస్ (01) ఖాళీలు ఉన్నాయి.
* స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022-23లో భాగంగా జూనియర్ ఆఫీసర్ కేవైసీ/ బ్యాక్ ఆఫీస్ (2), జూనియర్ ఆఫీసర్ కేవైసీ/ రిటైల్/ బ్యాక్ ఆఫీస్ (02 ) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, సెక్యూరిటీస్ మార్కెట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఎన్‌ఐఎస్‌ఎం/ ఎన్‌సీఎఫ్‌ఎం సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, 7వ అంతస్తు, నారిమన్ పాయింట్, ముంబయి అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు ముంబై, బెంగళూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 05-09-2022ని తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..