
బీహార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో.. 276 అసిస్టెంట్ (మల్టిపర్పస్), అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆగస్టు 2, 1989 నుంచి ఆగస్టు 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 16, 2022 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.850లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.650లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.47,900ల నుంచి రూ.63,840లు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఆధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం 100 మార్కులకుగానూ 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు గంటలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 200ల మార్కులకు గానూ, 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. పరీక్ష ఇంగ్లిష్, హిందీ మద్యమంలో మాత్రమే నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.