BPCL Recruitment: బీటెక్‌ అర్హతతో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Aug 28, 2022 | 10:33 AM

BPCL Recruitment 2022: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

BPCL Recruitment: బీటెక్‌ అర్హతతో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Bpcl Jobs
Follow us on

BPCL Recruitment 2022: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో కెమికల్ ఇంజనీరింగ్ (31), సివిల్ ఇంజనీరింగ్ (8), కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (9), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (5), సేఫ్టీ ఇంజనీరింగ్./ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ (10), మెకానికల్ ఇంజనీరింగ్ (28), ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ (9), మెటలర్జీ ఇంజనీరింగ్ (2) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60% మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. 2020, 21, 22 ఏడాదుల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అర్హత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 26-08-2022న మొదలై 08-09-2022తో పూర్తవుతుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 జీతంగా చెల్లిస్తారు.

* ఎంపికైన వారు కొచ్చిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..