BHEL Recruitment 2022: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తున్న..

|

Sep 06, 2022 | 8:05 AM

భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL) 575 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల (Graduate Apprentice posts)కు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు రేపటితో..

BHEL Recruitment 2022: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తున్న..
Bhel
Follow us on

BHEL Graduate Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL) 575 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల (Graduate Apprentice posts)కు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 7, 2022వ తేదీ రాత్రి 11 గంటల 45 నిముషాలకు ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022వ తేదీనాటికి 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు రూ.200లు చొప్పున అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.40,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. స్టైపెండ్‌ చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్

ఇవి కూడా చదవండి
  • మెకానికల్ పోస్టులు: 52
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు: 15
  • సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 8
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 6
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు: 2
  • కెమికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 1
  • అకౌంటెంట్ పోస్టులు: 4
  • అసిస్టెంట్-HR పోస్టులు: 3
  • B.Sc. నర్సింగ్ పోస్టులు: 2
  • బి. ఫార్మ్ పోస్టులు: 2

టెక్నీషియన్ అప్రెంటిస్

  • మెకానికల్ పోస్టులు: 52
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు: 15
  • సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 10
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పోస్టులు: 6
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు: 6
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & కంట్రోల్‌ పోస్టులు: 1

ట్రేడ్ అప్రెంటిస్

  • ఫిట్టర్ పోస్టులు: 186
  • వెల్డర్ పోస్టులు: 120
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 34
  • టర్నర్ పోస్టులు: 14
  • మెషినిస్ట్ పోస్టులు: 14
  • మెకానిక్ R & AC పోస్టులు: 6
  • ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పోస్టులు: 6
  • కార్పెంటర్‌ పోస్టులు: 4
  • మెకానిక్ మోటార్ వెహికల్ పోస్టులు: 4
  • ప్లంబర్ పోస్టులు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.