BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

| Edited By: Ravi Kiran

Sep 23, 2021 | 6:39 AM

BHEL Recruitment 2021: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ సంస్థలో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులను..

BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Follow us on

BHEL Recruitment 2021: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ సంస్థలో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఇంజనీర్‌ (సివిల్‌) – 07, సూపర్ వైజర్‌ (సివిల్‌) – 15 ఖాళీలు ఉన్నాయి.
* ఇంజనీర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ / ఇంజనీరింగ్లో డ్యూయల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* అభ్యర్థుల వయసు 34 ఏళ్లు మించకూడదు.
* సూపర్‌ వైజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఫుల్‌ టైం డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 34 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 71,040, సూపర్‌ వైజర్‌ పోస్టులకు నెలకు రూ. 39,670 జీతంగా అందిస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 04-09-2021న ప్రారంభం కాగా.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 24-09-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Amazon Jobs: అమెజాన్‌లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష.. పూర్తి వివరాలు..!

AP ECET Answer Key 2021: ఏపీ ఈసెట్ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలకు రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలు మీకోసం..

Civils Free Coaching: సివిల్స్‌ కోచింగ్ తీసుకోవాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా శిక్షణ పొందే అవకాశం.