Bhagavad Geeta: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సెంట్రల్ సిలబస్‌లో భగవద్గీత.. తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్

|

Mar 14, 2023 | 10:51 AM

మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గీత ఒక ప్రత్యేక గ్రంథంగా విశిష్టతను సొంతం చేసుకుంది.

Bhagavad Geeta: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సెంట్రల్ సిలబస్‌లో భగవద్గీత.. తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్
Bhagavad Gita
Follow us on

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి  సెంట్రల్ సిలబస్ లో భగవద్గీతను బోధించనున్నారు. సెంట్రల్ సిలబస్ లోని ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చనున్నారు.

మోడీ ప్రభుత్వం తీసుకుని వస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇక నుంచి భగవద్గీతను బోధించనున్నారు. అంతేకాదు భగవద్గీతలోని శ్లోకాలను పదకొండు, పన్నెండవ తరగతులలో (ఇంటర్మీడియట్) సంస్కృత పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేరచనున్నట్టు కేంద్ర మంత్రి “అన్నపూర్ణాదేవి” పార్లమెంట్ లో తెలియజేశారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి దేశ సంస్కృతి, జ్ఞాన వ్యవస్థను పరిచయం చేయడంలో భాగంగా భగవద్గీతలోని విలువలను విద్యార్థులకు అందించడమే ఉద్దేశమని ఈ మేరకు ఇప్పటికే భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్  అన్ని కోణాల్లో తన పరిశోధనను మొదలు పెట్టిందన్నారు.

ఈ మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల విద్యా శాఖ కార్యాచరణ ఇప్పటికే మొదలుపెట్టిందని చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి గ్రాస్ రూట్ స్థాయిల నుండి ఇన్‌పుట్‌లను ఆహ్వానించే నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్స్ (NCF) అభివృద్ధిని NCERT ప్రారంభించిందని మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు.

ఇవి కూడా చదవండి

“ఈ శతాబ్దంలో జ్ఞాన శక్తిగా మారాలంటే, మనం మన వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి.. ప్రపంచానికి ‘భారతీయ మార్గాన్ని’ బోధించాలి” అని  మంత్రి అన్నపూర్ణ చెప్పారు. ముఖ్యంగా పార్లమెంటరీ ప్యానెల్ లో..  ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన “అసంగీత స్వాతంత్ర్య సమరయోధుల” విజయాలు, త్యాగాలను పొందుపరచాలని NCERTకి సూచించింది. అంతేకాదు వివిధ వృత్తులకు చెందిన ప్రముఖ భారతీయ మహిళా ప్రముఖుల జీవితాన్ని పాఠ్యంశాలుగా అందించాలని..  NCERT “రెగ్యులర్ బుక్స్”లో చేర్చాలని సూచించారు.

భగవద్గీత:

మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గీత ఒక ప్రత్యేక గ్రంథంగా విశిష్టతను సొంతం చేసుకుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు మానవాళికి అందించిన జ్ఞానం. భగవద్గీతలో భగవంతుని తత్వం, ఆత్మ తత్వం,, జీవన గమ్యం, గమ్యసాధనా యోగాలు బోధించారు.భగవద్గీత హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి.

అయితే పాఠ్యంశాలుగా గీతను భోధించాలనే నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. భారత విద్యావ్యవస్థను కాషాయ రంగులోకి మార్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

మరిన్ని కెరీర్ అండ్ నాలెడ్జ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..