Jobs: ప్రాంప్ట్‌ ఇంజనీర్లకు భలే డిమాండ్‌.. ఇది నేర్చుకుంటే మీకు తిరుగే ఉండదు

|

Sep 03, 2024 | 4:51 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్నో చాట్‌ బాట్‌ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. యూజర్లు అడిగే ప్రతీ ప్రశ్నకు క్షణాల్లో సమాధానం ఇస్తున్నాయి ఈ చాట్‌బాట్‌లు. వీటిని సమర్థవంతంగా సేవలు అందించేందుకు ప్రాంప్ట్‌ ఇంజనీర్ల అవసరం పడుతుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాచారం ఇవ్వడమే ఈ ప్రాంప్ట్‌ ఇంజనీర్ల విధి...

Jobs: ప్రాంప్ట్‌ ఇంజనీర్లకు భలే డిమాండ్‌.. ఇది నేర్చుకుంటే మీకు తిరుగే ఉండదు
Prompt Engineering
Follow us on

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ఏఐ టూల్స్‌ ప్రతీ రంగంలో అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో ఉద్యోగాలు పోతున్నాయని అంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాల కోత ఉంటున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే ఏఐ రంగం కొత్త ఉద్యోగాలను సైతం సృష్టిస్తోంది. ఇలా పుట్టుకొచ్చిన ఉద్యోగాలే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పోస్టులు. టెక్నాలజీ రంగంలో సరికొత్త అవకాశాలను తీసుకొస్తున్నాయి ఈ ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్నో చాట్‌ బాట్‌ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. యూజర్లు అడిగే ప్రతీ ప్రశ్నకు క్షణాల్లో సమాధానం ఇస్తున్నాయి ఈ చాట్‌బాట్‌లు. వీటిని సమర్థవంతంగా సేవలు అందించేందుకు ప్రాంప్ట్‌ ఇంజనీర్ల అవసరం పడుతుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాచారం ఇవ్వడమే ఈ ప్రాంప్ట్‌ ఇంజనీర్ల విధి. ప్రాంప్ట్‌ ఇంజనీర్ల విధుల్లో ఏఐ టూల్స్‌ డిజైనింగ్, స్ట్రక్చరింగ్, ప్రోగ్రామింగ్, కోడింగ్‌లను రూపొందిస్తుంటారు. ప్రాంప్ట్‌ ఇంజనీర్‌గా రాణించాలనుకునే వారికి వారికి ప్రధానంగా ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్‌ వంటి రెండు స్కిల్స్‌ ఉండాలి.

ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లలో బీటెక్‌ పూర్తి చేసిన వారు ప్రాంప్ట్‌ ఇంజనీర్లుగా రాణించగలుగుతారు. దీనికి కారణం వీరికి కోడింగ్‌పై పట్టు ఉండడమే. ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌కు సంబంధించి సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి కోర్సులు ఉడెమీ, కోర్సెరా, ఎడ్యురేక వంటి సంస్థలు ఆన్‌లైన్‌లో అందిస్తున్నాయి. అదే విధంగా పలు ఐటీ సంస్థలు సైతం తమ సిబ్బందికి ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాయి.

ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి ఉద్యోగావకాలు కూడా మెండుగా ఉంటాయి. దీనికి కారణం ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో కూడిన చాట్‌బోట్‌లకు డిమాండ్‌ పెరుగుతోన్న తరుణంలో ప్రాంప్ట్‌ ఇంజనీర్లకు భారీగా అవకాశాలు లభించనున్నాయి. ఏఐ ఉద్యోగాల్లో ప్రాంప్ట్‌ ఇంజనీర్ల వాటా 30 శాతం ఉంటుంందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ప్రాంప్ట్‌ ఇంజనీర్ల వేతనాలు సైతం ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రారంభ వేతనం రూ. 6 లక్షలు ఉండగా, గరిష్టంగా రూ. 12 లక్షల వార్షిక వేతనం కూడా పొందొచ్చు. ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్‌ కోర్సుల ద్వారా ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌లో సర్టిఫికెట్స్‌ పొందొచ్చు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..