BEML Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు..

|

Mar 16, 2022 | 9:36 AM

భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌ (BEML)..మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల (Management Trainee posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ..

BEML Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు..
Beml
Follow us on

BEML Limited Management Trainee Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌ (BEML)..మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల (Management Trainee posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

పోస్టులు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఈఈఈ స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 500
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NEET PG 2021: వైద్య విద్యార్ధులకు అలర్ట్‌! నీట్‌ పీజీ 2021 కటాఫ్‌ మార్కులు 15 శాతానికి తగ్గింపు..