BEL Trainee Publication Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లోని సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో ట్రైనీ పబ్లికేషన్ ఆఫీసర్ (Trainee Publication Officers) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టుల వివరాలు: ట్రైనీ పబ్లికేషన్ ఆఫీసర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 1, 2022నాటికి 28 ఏళ్లు మించరాదు.
పే స్కేల్: మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.35,000, మూడో ఏడాది నెలకు రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన అర్హత మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Deputy General Manager (HR/C/A&F/CMS), Bharat Electronics Limited, Jalahalli Post, Bengaluru – 560013.
దరఖాస్తు రుసుము: రూ.200
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: