BEL Recruitment: బీటెక్‌ పూర్తి చేశారా.? భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం పొందే అవకాశం.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

Jul 22, 2022 | 6:30 AM

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులను...

BEL Recruitment: బీటెక్‌ పూర్తి చేశారా.? భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం పొందే అవకాశం.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Follow us on

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 ప్రాజెక్ట్‌ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 40,000, సెకండ్‌ ఇయర్‌లో నెలకు రూ. 45,000, మూడో ఏడాదిలో నెలకు రూ. 50,000, ఫోర్త్‌ ఇయర్‌లో రూ. 55,000 చెల్లిస్తారు.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 04-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..