హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్.. ఎలక్ట్రానిక్స్/సీఎస్‌ఈ/మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/సివిల్/డీసీసీపీ ట్రేడుల్లో 84 గ్రాడ్యుయేట్, టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. తప్పనిసరిగా 2022, 2021, 2022 విద్యాసంవత్సరాల్లో మాత్రమే చదివి ఉండాలి. అలాగే మార్చి 1, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని డిసెంబర్ 23, 2022 (శుక్రవారం) తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.11,110లు, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,400ల చొప్పున ఏడాదిపాటు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.