బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. తాత్కాలిక ప్రాతిపదికన 14 ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కెమికల్ ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్, మెకానికల్, కెమిక స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. డిసెంబర్ 1, 2022 నాటికి 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని జనవరి 7, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.472లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది నెలకు రూ.45,000, మూడో ఏడాది నెలకు రూ.50,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
DGM (HR/MR,MS&ADSN)
Bharat Electronics Limited
Jalahalli P.O., Bengaluru 560013.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.