Jobs:ఈ అర్హతలు ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం… నెలకు రూ. 50 వేల జీతం. ఎలా ఎంపిక చేస్తారంటే.

|

Mar 12, 2023 | 3:32 PM

10వ తరగతి మొదలు ఎంబీఏ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు పొందే సదవకాశం. బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది..

Jobs:ఈ అర్హతలు ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నెలకు రూ. 50 వేల జీతం. ఎలా ఎంపిక చేస్తారంటే.
Jobs
Follow us on

10వ తరగతి మొదలు ఎంబీఏ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు పొందే సదవకాశం. బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ హబ్‌ ఆఫీసుల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 28 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఈ టెండరింగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 10వ తరగతి/బీటెక్/బీఈ/బీకామ్/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్కిల్ టెస్ట్ /రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,499 నుంచి రూ. 50,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మార్చి 24ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..