BECIL Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. టైపింగ్‌లో ప్రావీణ్యం ఉంటే చాలు.. పూర్తి వివరాలు..

|

May 19, 2022 | 1:06 PM

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ డేటా ఎంట్రీ ఆపరేట్‌ పోస్టులను భర్తీ చేయనుంది...

BECIL Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. టైపింగ్‌లో ప్రావీణ్యం ఉంటే చాలు.. పూర్తి వివరాలు..
Becil Jobs
Follow us on

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ డేటా ఎంట్రీ ఆపరేట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 86 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇంగ్లిష్‌, హిందీలో టైపింగ్‌లో నైపుణ్యం ఉండాలి. ఎమ్మెస్‌ వర్డ్‌, పవర్‌ పాయింట్‌, ఎక్సెల్‌పై అవగాహన ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్కిల్‌టెస్ట్‌, ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీహెచ్‌ అభ్యర్థులు దరఖౄస్తు ఫీజుగా రూ. 450, ఇతరులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు మే 22ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…