BECIL Recruitment: నిరుద్యోగులకు శుభవార్త… బీఈసీఐఎల్‌లో 463 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నేడు చివరి తేదీ

|

Apr 22, 2021 | 3:02 PM

BECIL Recruitment 2021: బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే....

BECIL Recruitment: నిరుద్యోగులకు శుభవార్త... బీఈసీఐఎల్‌లో 463 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నేడు చివరి తేదీ
Becil Recruitment
Follow us on

BECIL Recruitment 2021: బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సంస్థ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా ఇన్వెస్టిగేటర్, సూపర్ వైజర్స్, సిస్టెమ్ అనలిస్ట్, సీనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్, జూనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్, యూడీసీ, ఎంటీఎస్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పెర్ట్ మరియు యంగ్ ప్రొఫేషనల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు నోటిపికేషన్‌ విడుదల కాగా, దరఖాస్తు చేసుకునేందుకు నేడు (ఏప్రిల్‌22) చివరి తేదీ. దరఖాస్తు చేసుకునే సందర్భంలో అభ్యర్థులు ఈమెయిల్ ఐడీని సరి చూసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

ఖాళీల వివరాలు..

ఇన్వెస్టిగేటర్ -300, సూపర్ వైజర్ -50, సిస్టెమ్ అనలిస్ట్-04, సీనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్-04, జూనియర్ డొమైన్ ఎక్ప్పెర్ట్-29, జూనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్-41, యూడీసీ-04, ఎంటీఎస్-18
Subject Matter Expert – ఎస్ఎంఈ- 07, యంగ్ ప్రొఫెషినల్స్-10.

వేతనాల వివరాలు

ఇన్వెస్టిగేట్ విభాగంలో ఉద్యోగాలకు సెలెక్ట్‌ అయిన వారికి నెలకు రూ.24 వేల వరకు వేతనం చెల్లించనుండగా, సూపర్ వైజర్-రూ.30 వేలు, సిస్టెమ్ అనలిస్ట్-రూ.లక్ష, సీనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్-రూ. 80 వేలు, జూనియర్ డొమైన్ ఎక్స్పెర్ట్-రూ. 80 వేలు, UDC-రూ. 22 వేలు, ఎంటీఎస్-రూ.15 వేలు
ఎస్ఎంఈ-రూ. 80 వేలు, యంగ్ ప్రొఫేషినల్స్-రూ.70 వేలు

విద్యార్హతల వివరాలు:

ఇందులో ఉన్న వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను ఉన్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలంటే…

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://becilmol.cbtexam.in వెబ్ సైట్లో ఈ నెల 22లోగా దరఖాస్తు చేయాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు రూ. 955ను పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారికి రూ. 670 ఫీజుగా నిర్ణయించారు.

ఇవీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 86 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌… దరఖాస్తు గడువు మే 3 వరకు

TSPSC Recruitment 2021: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త… ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు

NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తులకు చివరి తేదీ మే 16