BECIL Recruitment 2021: భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకి చెందిన నోయిడాలోని బీఈసీఐఎల్, న్యూఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి (ఎన్‌సీహెచ్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ కన్సల్టెంట్ (హోమియోపతి), కన్సల్టెంట్ (అడ్మిన్), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా గ్రాడ్యుయేషన్, బీహెచ్‌ఎంసీ, ఎండీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* దీంతో పాటు సంబంధిన పనిలో అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు రూ. 20,976 నుంచి రూ. 70,000 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 13-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అందాలను చూస్తే మైమరచిపోతారు..
Azim Premji: మనసున్న మారాజులు వీరే.. ప్రతిరోజు రూ. 27 కోట్లు విరాళం.. టాప్ ఎవరో తెలుసా..