BARC Recruitment: చివరి అవకాశం.. బార్క్‌లో మెడికల్ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. అప్లై చేసుకున్నారా.?
BARC Recruitment: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (BARC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ.. ముంబయి, హరియాణా, కోల్‌కతాల్లో ఉన్న బార్క్ కేంద్రాల్లో మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో...
BARC Recruitment: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (BARC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ.. ముంబయి, హరియాణా, కోల్‌కతాల్లో ఉన్న బార్క్ కేంద్రాల్లో మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (12-09-2022) గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో నర్సు-ఎ (13), సైంటిఫిక్ అసిస్టెంట్-బి(పాథాలజీ) (02), సైంటిఫిక్ అసిస్టెంట్-బి(న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్) (08), సైంటిఫిక్ అసిస్టెంట్-సి(మెడికల్ సోషల్ వర్కర్) (01), సబ్ ఆఫీసర్-బి (04), సైంటిఫిక్ అసిస్టెంట్-బి(సివిల్) (08) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి పన్నెండో తరగతి, బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ డీఎంఎల్‌టీ, పీజీ (మెడికల్ సోషల్ వర్క్), డిప్లొమా(సివిల్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 12-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..