Teaching Posts: బనారస్ హిందూ వర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Teaching Posts: బనారస్ హిందూ యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వారణాసిలో ఉన్న ఈ యూనివర్సిటీకి చెందిన ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది...
Teaching Posts: బనారస్ హిందూ యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వారణాసిలో ఉన్న ఈ యూనివర్సిటీకి చెందిన ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొఫెసర్ పోస్టులు 3, అసోసియేట్ పోస్టులు 15 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టీచింగ్ ఫీల్డ్‌లో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత బనారస్ యూనివర్సిటీకి అప్లికేషన్ హార్డ్ కాపీని సమర్పించాలి.
* అభ్యర్థులను పని అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 30-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* అప్లికేషన్ హార్డ్ కాపీని 08-10-2022 తేదీలోపు పంపించాల్సి ఉంటుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..