SPMCIL Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్‌ మింటింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

SPMCIL Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్‌ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

SPMCIL Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్‌ మింటింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Spmcil Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 11, 2022 | 8:46 PM

SPMCIL Recruitment: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్‌ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 37 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డిప్యూటీ మేనేజర్(ఎన్విరాన్‌మెంట్‌) (01), అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్) (16), అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ & అకౌంట్స్) (10), అసిస్టెంట్ మేనేజర్(లీగల్) (03), అసిస్టెంట్ మేనేజర్(హెచ్‌ఆర్‌) (03), అసిస్టెంట్ మేనేజర్(ఎన్విరాన్‌మెంట్) (01), అసిస్టెంట్ మేనేజర్(మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) (01), అసిస్టెంట్ మేనేజర్(సివిల్) (01), అసిస్టెంట్ మేనేజర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) (01) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

* డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు 30 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అప్లికేషన్‌ ఫీజుగా రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు రూ. 600 చెల్లించాలి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 03-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..